వచ్చే 40 రోజుల్లో తెదేపా, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, పేద, బడుగు.. బలహీన వర్గాలకు మంచి పాలన అందుతుందని సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ అన్నారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, అప్పుడు తాను అధ్యక్షుల అనుమతితో విజయయాత్ర నిర్వహిస్తానన్నారు. ఆయన శనివారం కర్నూలులోని జనసేన కార్యాలయంలో మాట్లాడారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలు రద్దవుతాయంటూ వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. ఈ పభుత్వ హయాంలో కల్తీ మద్యంతో ఎందరో మృతి చెందారని పేర్కొన్నారు. అనంతరం పృథ్వీరాజ్ సతీమణి పద్మరేఖ జనసేన నాయకుడు అర్షద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
source : eenadu.net
Discussion about this post