ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. శుక్రవారం ఏపీపీఎస్సీ కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 కింద -18, టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ -07, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ -04, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ -01, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ -02, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ -01 చొప్పున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
రెవెన్యూ డివిజన్లలో పోస్టుల ఖరారు
కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంత్ కింద 19 పోస్టులు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
source : eenadu.net
Discussion about this post