పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈనెల 28 నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. ఈనెల 28న (ఆదివారం) ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 28వతేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు అంటే 27న (శనివారం) వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
source : sakshi.com










Discussion about this post