ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పర్యటన కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ నెల 27న జోన్-4లో మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ ముగించుకుని, 28న ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని కదిరిలో ప్రజాగళం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
source : eenadu.net
Discussion about this post