అనంత నగరంలో ఈ నెల 26న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని సీడబ్ల్యూసీ సభ్యుడు , మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆ రోజు జరిగే బహిరంగసభ స్థలాన్ని రఘువీరారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరవుతారన్నారు. 50 వేలమందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలో అనే అంశాలను సభలో వివరిస్తామన్నారు. వైకాపా నిర్వహించిన సిద్ధం సభకు డబ్బు, బిర్యాని పంచి జనాన్ని తరలించినట్లు తెలిసిందన్నారు. అధికారులను కూడా సభకు వాడుకున్నారని విమర్శించారు. సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం దారుణమన్నారు. డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీ, ఎస్సీ సెల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతోందని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తిలో పార్టీ సమావేశం కన్వీనర్ పుట్ల గంగాద్రి అధ్యక్షతన జరిగింది. అనంతపురంలో 26న జరిగే పార్టీ బహిరంగసభకు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
source : eenadu.net
Discussion about this post