ఈ నెల 19న బాలకృష్ణ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో నియోజక వర్గ వ్యాప్తంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోని విజయవంతం చేయాలని టిడిపి పిలుపు నిచ్చారు. బుధవారం బాలయ్య నివాసం వద్ద ఉన్న టిడిపి కార్యలయంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టిడిపి నాయకులు శ్రీనివాసులు, డాక్టర్ సురేంద్ర, జనసేన ఇన్‌చార్జ్ ఆకుల ఉమేష్, బిజెపి ఆదర్శ్ కుమార్ మాట్లాడుతు ఉమ్మడి కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట లోపు తన నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. అదే రోజు సాయంత్రం నియోజకవర్గం వ్యాప్తంగా ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి రోడ్ షోలో నందమూరి బాలకృష్ణ పాల్గొంటారన్నారు
source : prajasakthi.com
Discussion about this post