ధర్మవరం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళితులపై దాడి కేసులో 11 మందిని రామగిరి పోలీసులు గురువారం బైండోవర్ చేశారు. ఒక వర్గానికి చెందిన ఏడుగురిని, మరో వర్గానికి చెందిన నలుగురిని తహసీˆల్దారు నారాయణస్వామి ఎదుట పోలీసులు హాజరు పరిచి బైండోవర్ చేయించారు.
ధర్మవరం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళితులపై దాడికి సంబంధించి 11 మందిని రామగిరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఒక వర్గానికి చెందిన ఏడుగురు, మరో వర్గానికి చెందిన నలుగురిని తహసీల్దార్ నారాయణస్వామి ఎదుట హాజరుపరిచి అరెస్టు చేశారు.
రామగిరిలో మంగళవారం రాత్రి మారెమ్మ, ముత్యాలమ్మ ఊరేగింపు సందర్భంగా వాగ్వాదం జరగడంతో ఘర్షణలు తలెత్తకుండా ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బంగారు నగల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నగరంలోని పాతూరు ప్రాంతంలోని బంగారు నగల దుకాణాలపై అనంతపురం రీజినల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (విజిలెన్స్) అధికారులు గురువారం అనూహ్య దాడులు నిర్వహించారు. ఇలాహి, సయ్యద్, తాడిపత్రి నగల దుకాణాల్లో ఎలక్ట్రానిక్ తూకం మిషన్లు, రికార్డుల పరిశీలన చేపట్టారు.
రికార్డుల్లో వ్యత్యాసాలను గుర్తించి లీగల్ మెట్రాలజీ చట్టం కింద షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీటీఓ విజయలక్ష్మి, అసిస్టెంట్ కంట్రోలర్ సుధాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Discussion about this post