‘వై నాట్ 175’ అంటూ ఊరూవాడా ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… తొలిసారిగా నిరాశాపూరిత ‘స్వరం’ వినిపించారు. ‘56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయ్.
నేడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ‘ఎక్స్’ వేదికగా జగన్ వ్యాఖ్యలపై సెటైరికల్ ట్వీట్ పెట్టారు. 2001 నుంచి జగన్ ఒక్కొక్క వ్యాఖ్యను పోస్టులో ప్రస్తావించారు. నాడు ఎంత అహంభావంతో జగన్ మాట్లాడారు.. నేడు ఎంతటి నిరాశలో ఉన్నారనేది గంటా చెప్పకనే చెప్పారు. 2021లో వెంట్రుక కూడా పీకలేరంటూ వ్యాఖ్యానించిన జగన్.. 2035 వచ్చేసరికి హ్యాపీగా దిగిపోతానన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘ప్రజా వ్యతిరేకత కనబడింది. భవిష్యత్తు అర్థమైంది. తన ఓటమి తనకి వినబడింది. జగనన్న స్వరం మారింది.
2021లో నా వెంట్రుక కూడా పీకలేరు…!
2022లో నన్నే నమ్మండి…!
2023లో మిమ్మల్నే నమ్ముకున్నా…!
2024లో హ్యాపీగా దిగిపోతా..!
రాబోయేది తెలుగుదేశం – జనసేన ప్రభుత్వమనే సందేశం రాష్ట్రమంతా మారుమ్రోగుతుంది’’ అని గంటా ట్వీట్‌లో పేర్కొన్నారు.
source : https://www.andhrajyothy.com/2024/andhra-pradesh/ganta-srinivasa-rao-tweet-on-ys-jagan-pvch-1201070.html
Discussion about this post