ఆంధ్రప్రదేశ్: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 సంవత్సరాలు పై బడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు.శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అనుమతి ఇస్తారు.పోలింగ్ తేదీ 13వ తేదీకు పది రోజులు ముందు నుంచి వారు ఇంటి వద్ద నుంచి ఓటు వేయవచ్చు.వారు వేసిన ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్స్ లలో వుంచుతారు.
Discussion about this post