నేడు హిందూపురం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద “ప్రెస్ మీట్” కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్సీపి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు “నవీన్ నిశ్చల్”గారు, హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “T N దీపిక” గారు, ఎంపీ అభ్యర్థి “బోయ శాంతమ్మ” గారు, మాజీ ఎమ్మెల్యే “అబ్దుల్ ఘని” గారు, మాజీ సమన్వయకర్త “కొండూరు వేణుగోపాల్ రెడ్డి” గారు, వైయస్సార్సీపి నాయకులు “మధుమతి రెడ్డి” గారు , తదితర పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ….
1983వ సంవత్సరం నుంచి హిందూపురంలో వేరే పార్టీ ఇక్కడ గెలుస్తూ వచ్చింది. దీనికి కారణం వాళ్ల బలం కాదు. మాలో ఉన్న విభేదాల వలన వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు.
2014,2019 ఎన్నికలలో హిందూపురంలో కేవలం 10% ఓట్లతో ఓడిపోయాం.ఒక బూతుకు 40 ఓట్లు ఎక్కువ మెజారిటీ వస్తే ఈసారి హిందూపురంలో కచ్చితంగా జెండాను ఎగరవేస్తాం.
ఈసారి మహిళలకు పెద్దపీట వేస్తూ హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక గారిని ఎంపీ అభ్యర్థిగా బోయ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మ గారిని నిలబెట్టడం జరిగింది.
2019 ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా పథకాలను ప్రజల కోసం అందించారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరి అభ్యర్థులను ఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.
హిందూపురం టిడిపి పార్టీ వారికి కంచుకోటగా ఉంది అయితే ఈసారి మేము కలిసికట్టుగా పనిచేసే అది కంచుకోట కాదు ఇసుక తోట అని నిరూపిస్తాం మా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి బహుమతిగా ఇస్తాం.
అనంతరం నూతనంగా ఎన్నికైన శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ గారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్లు,మార్కెట్ యాడ్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల,టౌన్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు,JCS కన్వీనర్లు ,వార్డు ఇన్చార్జులు, వార్డు మెంబర్లు,కో ఆప్షన్ మెంబర్స్, సింగిల్ విండో అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు,వైసిపి నాయకులు, కార్యకర్తలు,గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు.
Discussion about this post