మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బిజెపితో చంద్రబాబు చేతులు కలిపారని వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతించారని, సామాజిక – ఆర్థిక కులగణనను ఆపాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మళ్లీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ వైపు వెళ్తారని చెప్పారు. మరోవైపు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయబోతున్నారు.
source : vartha.com
Discussion about this post