బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు తెదేపా కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు.
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న షరీఫ్. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సేవాలాల్ ఆశయాలకు తూట్లు పొడిచేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్ మండిపడ్డారు. అటవీ హక్కుల్ని ఉల్లంఘించి గిరిజనుల భూముల్ని బడా పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తున్న ఘనత జగన్‌రెడ్డిదేనని విమర్శించారు.
source : eenadu.net
Discussion about this post