మహారత్న కేటగిరీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) 314 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రెయినీ)- (ఓసీటీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారిని దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ కర్మాగారాలు/ యూనిట్లు/ గనుల్లో ఎక్కడైనా నియమిస్తారు.
సీటీటీ- మెటలర్జీ-57 పోస్టులు, ఎలక్ట్రికల్-64, మెకానికల్-100, ఇన్స్ట్రుమెంటేషన్-17, సివిల్-22, కెమికల్-18, సిరామిక్-06, ఎలక్ట్రానిక్స్-08, కంప్యూటర్/ఐటీ-20, డ్రాఫ్ట్స్‌మెన్-02 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేయాలంటే…పదోతరగతితోపాటు.. మెటలర్జీ/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేన్ అండ్ ఆటోమేషన్, సివిల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. డిస్టెన్స్/ కరస్పాండెన్స్ డిప్లొమా పూర్తిచేసినవారు అనర్హులు.
అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడుదు. ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు గరిష్ఠ వయసు సడలింపులు ఉంటాయి.
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ వారికి రూ.200. ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్‌లో ఉంటుంది. 100 ఆబెక్టివ్ తరహా ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రంలో 2 పార్ట్లు ఉంటాయి.
డొమైన్ పరిజ్ఞానానికి సంబంధించిన 50 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో 50 ప్రశ్నలు ఇస్తారు. సీబీటీ వ్యవధి 90 నిమిషాలు.
సీబీటీలో అన్‌రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్సీఎల్)/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
సీబీటీలో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ టెస్టును సెయిల్‌కు చెందిన కర్మాగారాలు/ యూనిట్లు/ గనుల్లో నిర్వహిస్తారు.
నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో పాటు అభ్యర్థులకు ఎటువంటి దృష్టీ, వినికిడి సమస్యలు ఉండకూడదు.
ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ఆన్ జాబ్ శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఏడాదిలో నెలకు రూ.16 వేలు, రెండో సంవత్సరంలో నెలకు రూ.18 వేలు వేతనంగా చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు రూ.38,920 వరకూ వేతనం అందుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024
వెబ్సైట్: www.sail.co.in
Discussion about this post