నమ్మించి నట్టేట ముంచడం అనే దానికి అసలైన నిదర్శనం చంద్రబాబు అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమకే టికెట్ లేదంటే ఇక ఎటు వెళ్లాలి అంటూ అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. అసలే వర్గపోరుతో గందరగోళంగా ఉన్న పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం, చివరి నిమిషం వరకూ ‘నీకే టికెట్’ అంటూ పలువురికి అధిష్టానం చెప్పడం నాయకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ ఓటికుండగా మారింది. చంద్రబాబును నమ్ముకున్న సీనియర్ నాయకులు ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
source : sakshi.com
Discussion about this post