అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పలువురు ముఖ్యులు, సీనియర్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. తొలి జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి సైతం సీట్లు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావు పేరు తొలి జాబితాలో లేకపోవడంతో పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుతం సీటు లేకుండా చేశారు.
ఆయన కోరుకున్న సీటు ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. గంటా అందుకు ఒప్పుకోకపోవడంతో తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కూడా చంద్రబాబు షాకిచ్చారు. పవన్ కళ్యాణ్ అభ్యంతరంతో ఆయనకు సీటు ఇచ్చేందుకు వెనుకాడుతూ తొలి జాబితాలో ఆయనకు సీటు ఖరారు చేయలేదు. దీంతో చింతమనేనికి సీటు ఇవ్వడం అనుమానంగా మారింది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు సైతం మొండిచేయి చూపారు.
source : sakshi.com
Discussion about this post