కుప్పంలో ఈ నెల 26న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్సీ జాషువా, ఎమ్మెల్సీ భరత్, సీఎం పర్యటనల సలహాదారు తలశిల రఘురామ్‌తో కలిసి రామకుప్పం, శాంతిపురం మండలాల్లో సీఎం పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద హెలీప్యాడ్, కుప్పం కెనాల్ కాలువను చూశారు. శాంతిపురం మండలంలోని మ ఠం వద్ద హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడే మంత్రి మీడియాతో మాట్లాడుతూ కుప్పం కెనాల్ పనులు కొంత ఆలస్యం కావడం, వేసవి రావడంతో ఇబ్బందిగా ఉన్నా నీరు తెస్తున్నామన్నారు. 14 ఏళ్లు సీఎంగా నీరు తేలేక పోయిన చంద్రబాబు, ఆయన పార్టీ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కుప్పంలో ఇప్పటికే రెండు చోట్ల రాజన్న క్యాంటిన్ ద్వారా నిత్యం వేల మందికి ఉదయం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నామన్నారు.
source : sakshi.com










Discussion about this post