రాప్తాడు ‘సిద్ధం’ సభపై రాష్ట్రమంతా దృష్టి సారించిందని, సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారో, వచ్చే ఐదేళ్లూ ఏం చేయబోతున్నానని ప్రకటిస్తారో అనే ఉత్కంఠతతో ప్రజానీకమంతా ఎదురు చూస్తోందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. ఈసారి కూడా రాయలసీమలో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సిద్ధం సభలతో ఇప్పటికే భీమిలిలో భయపెట్టాం, దెందులూరులో దడ పుట్టించాం, రాప్తాడు సభతో ప్రతిపక్షాలను రప్ఫాడిస్తామని’ చెప్పారు. జగనన్న మళ్లీ వస్తేనే తమకు మేలు జరుగుతుందనే భావన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, బడుగు బలహీన వర్గాల్లో నెలకొందన్నారు. సభకు తండోపతండాలుగా వచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. ఆయన ప్రసంగం తర్వాత జగనన్న సైనికులు కదనరంగంలోకి దూకుతారన్నారు. ఎన్నికలయ్యేంత వరకు అదే ఊపుతో పని చేస్తారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదగకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్రలు పన్ని జైలుకు పంపారని అన్నారు. అయితే బంతిని నేలకు కొడితే ఎంతవేగంగా పైకి వస్తుందో అంతేవేగంగా జగనన్న జనంలోకి వచ్చారన్నారు. ఓటమికి నిరాశ చెందకుండా ప్రజలతోనే ఉండి పాదయాత్ర చేసి నవరత్నాల మేనిఫెస్టోను ప్రకటించి అధికారంలోకి వచ్చారన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి 99 శాతానికి పైగా హామీలు అమలు చేశారన్నారు. ఈ విషయంలో ఆయన దేశానికే ఆదర్శమన్నారు. ‘సిద్ధం’ సభ రాప్తాడులో నిర్వహించడం గర్వకారణమన్నారు. నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరావాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ సిద్ధం సభలను చూసి చంద్రబాబు, లోకేష్, జనసేన నాయకులకు దడ పుట్టుకొచ్చిందన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు. ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ఒక సారి మాట ఇస్తే మడమ తిప్పదన్నారు.
source : sakshi.com
Discussion about this post