గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని ప్రకటించారు. అలాగే.. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని తేలిపారు.
సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘స్వతంత్ర భారతావనిని గ’ణతంత్ర రాజ్యంగా మార్చింది. ఆ పవిత్ర గ్రంథ రూపకరర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవర్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు’ తేలిపారు
source : sakshi.com
Discussion about this post