సీఎం జగన్ కూర్చునే కుర్చీలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూర్చున్నట్లు ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీఎం సమావేశ మందిరం నుంచి వర్చువల్ విధానంలో అమర్‌నాథ్ 8 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ‘సీఎం సీట్లో మంత్రి’ అంటూ పలువురు వ్యాఖ్యానాలు చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి అమర్‌నాథ్ గురువారం స్పందించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రాకపోవడంతో తాను ఆ సమావేశంలో పాల్గొన్నానని అన్నారు. తాను కూర్చున్నది ముఖ్యమంత్రి కుర్చీలో కాదని స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post