‘నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? నేనే వేశానని అంటున్నారు. నేను గులకరాళ్లు వేయిస్తానా’ అంటూ విశాఖ జిల్లా గాజువాక, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘అసలు ఎవరిది తప్పు? పోలీసులు, కరెంట్ డిపార్ట్‌మెంట్‌దే తప్పు. పోలీసులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్‌కు, సీఎస్‌కు బాధ్యత లేదా’ అని అన్నారు. ‘కోడికత్తి డ్రామాలు వేశావు. గొడ్డలి వేటుతో బాబాయిని చంపేసి నామీద పెట్టాలని ప్రయత్నించావు.
ఇప్పుడు నీ చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇప్పడు విజయవాడలో డ్రామాలు వేస్తున్నారు’ అంటూ సీఎం జగన్‌పై దాడిని అవహేళన చేస్తూ మాట్లాడారు. సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని అవహేళనగా మాట్లాడటంపై ప్రజలు బాబు తీరుని అసహ్యించుకున్నారు. జగన్ రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కినా ఎవరి జీవితాలూ మారలేదని చంద్రబాబు అన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తానేనంటూ బాబు అబద్ధాలు చెప్పేశారు. వలంటీర్లతో నేరాలు, ఘోరాలు చేయించారని అన్నారు. ఈసారి ఓటు కూటమికి వేయాలని, తాను మళ్లీ సీఎం అవుతానని బాబు అనడంతో జనసేన కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది. పవన్ సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తి అంటూ పరోక్షంగా రాజకీయాల్లో అనుభవం లేదని చెప్పడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
source : sakshi.com
Discussion about this post