అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం గాంధీజీ చిత్రపటాన్ని ఉంచి జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, తదితరులతో కలసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యాన్ని సిద్ధింపజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనన్నారు. పేదరికం నిర్మూళనకు వివిధ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.2.40 లక్షల కోట్ల లబ్ధిని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేశారన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని చేసుకుని పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించి సర్వజన హితం తన మతమని గాంధీజీ వ్యాఖ్యలను నిజం చేశారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ … సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సచివాలయాల ద్వారా 450 రకాల పౌర సేవలను ప్రజలకు చేరువ చేశారన్నారు. కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్‌కుమార్ యాదవ్, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, డీసీసీబీ చైర్‌పర్సన్ ఎం.లిఖిత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ మునీరా, నాయకులు వనారస బలరాం, గుజ్జల శివయ్య, చిదంబరరెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, కుమ్మరి ఓబులేసు, సాకే ఆంజనేయులు, యల్లనూరు ప్రసాద్, శివారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post