ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశం కోసం సచివాలయానికి వెళుతున్న సమయంలో మందడం శిబిరం వద్ద రాజధాని రైతులు ఆకుపచ్చ జెండాలు పట్టుకొని నిరసన తెలిపారు. ‘ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి.. ముఖ్యమంత్రి మొండి వైఖరి నశించాలి’ అని నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శిబిరంలో నుంచి రైతులు రహదారిపైకి రాకుండా పోలీసులు అడ్డుగా నిలుచున్నారు. అన్నదాతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఈ సర్కార్‌ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post