‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని.. టీడీపీ సభలకు జనం రావడం లేదంటూ ఎద్దేవా చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్. పరిగి మండలంలో టీడీపీ నుంచి 430 కుటుంబాలు మంత్రి ఉషశ్రీ చరణ్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు రోజుల ముందు వరకు వాలంటీర్లను కించపరిచిన చంద్రబాబు.. పెనుగొండ సభలో వాలంటీర్లను కొనసాగిస్తాం.. టీడీపీకి పని చేయడంటూ అడుక్కోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.
అనంతపురం వద్ద జరిగిన సిద్ధం సభలో పార్కింగ్ స్థలంలో సగం కూడా లేదు చంద్రబాబు రా కదలిరా సభ అంటూ మంత్రి చురకలు అంటించారు. సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి ఉషశ్రీ చరణ్ దుయ్యబట్టారు.
source : sakshi.com
Discussion about this post