రాప్తాడులో ఈ నెల 11న జరిగే ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభను విజయవంతం చేద్డామని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ ఆవరణలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. మరోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవడానికి సిద్ధం అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతమైన పాలనను సీఎం జగనన్ అందించారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారన్నారు. ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఏకై క ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారని కొనియాడారు. పైలా మాట్లాడుతూ ‘సిద్ధం’ సభకు రాయలసీమలోని 49 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ కేడరంతా హాజరువుతున్నట్లు తెలిపారు. లక్షలాదిగా కార్యకర్తలు, అభిమానులు హాజరవుతున్నారన్నారు. కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల రాష్ట్ర చైర్మన్లు హరీష్‌కుమార్ యాదవ్, ఎస్.రంగన్న, నదీం అహ్మద్, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ రిజ్వాన్, ఏడీసీసీ బ్యాంక్ చైర్‌పర్సన్ లిఖిత, మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రరెడ్డి, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, అనిల్‌కుమార్‌రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, జోనల్ ఇన్‌చార్జ్‌లు రిలాక్స్ నాగరాజు, రాజా రాం, అనుబంధ సంఘాల అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా, శ్రీదేవి, ఎగ్గుల శ్రీనివాసులు, ఎన్‌వీ నారాయణ, నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మారుతీనాయుడు, రాళ్ల తిమ్మారెడ్డి, చిట్రా వెంకటేష్, చింతకుంట మధు, పెన్నోబులేసు, అనిల్‌కుమార్ గౌడ్, మిద్దె నగేష్, ఓబులేసు, రాధాయాదవ్, అంజలి, అనిత, మునీర పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post