జగనన్న ఎక్కడికెళ్లినా ఆ జిల్లావాసులకు ఆరోజు నరకమే అన్నది నిర్వివాదాంశం. రోడ్డు మధ్యలో బారికేడ్లు, ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు, షాపుల మూసివేత, చెట్ల నరికివేత వంటి వాటితో ప్రజలు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కాదు. ఇక జనాలను తరలించేందుకు ఆర్టీసీˆ బస్సులను తీసుకెళ్లే ప్రక్రియలో ఆ రోజు జిల్లావాసులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందే. అత్యవసర సేవలకు కూడా అనుమతి ఉండని పరిస్థితి. ఇక జగనన్న సీˆఎం హోదాలో కాకుండా వైకాపా అధినేతగా ఈ ఐదేళ్లలో మొదటిసారి పర్యటించారు. అయితే ఈసారి జనాల కష్టాలు పది రెట్లు పెరిగాయి. ఈసారి ఏకంగా జాతీయ రహదారులే స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు పడిన అవస్థలు వర్ణనాతీతం. అనంతపురం నగరంలోని రుద్రంపేట నుంచి కనగానపల్లి మండలం మామిళ్లపళ్లి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ వెళ్లే దారిలో పెనుకొండ నుంచి మామిళ్లపల్లి వరకు వాహనాలు నిలిచిపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాప్తాడు వద్ద చిలమత్తూరు వెళ్లాల్సిన అంబులెన్సులు చిక్కుకుపోయాయి.
బలవంతపు తరలింపులు..
సిద్ధం సభ కోసం రాయలసీˆమలోని 8 జిల్లాల నుంచి జనాల్ని తరలించారు. ఉమ్మడి అనంతపురంలో వాలంటీర్లు, వైకాపా నాయకులు జనాలను బలవంతంగా బస్సుల్లో ఎక్కించుకుని సభకు తీసుకెళ్లారు. ఉదయం 10 గంటలకే రాప్తాడుకు బస్సుల్లో జనాలను తరలించారు. చాలాచోట్ల జనాలు సభకు రావడానికి అసక్తి చూపలేదు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు ఖాళీగా దర్శనమిచ్చాయి. సభకు రావడం కోసం బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరికీ బస్సుల్లోనే బిర్యానీ ప్యాకెట్టు, మందు ఏర్పాటు చేశారు. సభకు వస్తున్నప్పుడే బస్సులో మందు తాగించుకుంటూ జనాల్ని తీసుకొచ్చారు. సీˆఎం మధ్యాహ్నం 3.40 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటివరకు జనాలు ఎండలో అలమటించిపోయారు.
మందు, బిర్యాని ఇచ్చారు
‘‘మాది కర్నూలు జిల్లా తుగ్గలి. రాప్తాడుకు 4 గంటలకు వచ్చా. తాగినా నిజం మాట్లాడుతా. జగన్ బస్సులో వచ్చా. బిర్యాని, ఒక్కొక్కరికి ఓ క్వార్టర్ ఇచ్చారు. వాటరు ప్యాకెట్లు ఐదు ఇచ్చారు. ఎవరు అడిగినా ఇదే చెబుతా. మందు బాగుంది. బిర్యాని ఒక్కొక్కరికి ఒక పొట్లం ఇచ్చారు. ఇంకా మిగిలింది’’ అంటూ సభా ప్రాంగణంలో మత్తులో ఉన్న వ్యక్తి మాట్లాడాడు.
source : eenadu.net










Discussion about this post