సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పంచాయతీల నిధులు కాజేయడంతో గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు అందక పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య కేసుల్లో ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రినేనని విమర్శించారు. ఆదివారం మండలంలోని చిల్లకొండాయపల్లి గ్రామంలో బాబుష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆయనను తెదేపా నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులు వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు దోచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. చిత్రావతి ఇసుక దోపిడీలో వైకాపా నాయకులు రూ.కోట్లు సంపాదించారని, గ్రామాల్లోని కొండలు, గుట్టలు కరిగించి మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం రాగానే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. చంద్రబాబునాయుడు హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, వచ్చే ఎన్నికల్లో తెదేపా – జనసేన ఘన విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు రామ్మోహన్, నాయకులు విజయ్‌కుమార్, రఘురాంచౌదరి, ఆదినారాయణచౌదరి, రాజశేఖర్, సాయి, రమణ, శ్రీనివాసులు, జనార్దన్, ధనుంజయ్యనాయుడు, లక్ష్మీనరసింహులు, యల్లప్ప, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post