అమరావతి : ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎపిలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉత్తర్వులు జారీ చేసింది.గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పింఛను లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్ సూచించింది.
Discussion about this post