గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, అందులో భాగంగానే సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం ఆవిష్కరించారని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. గురువారం పుత్తూరు రూరల్ మండలం వేపగుంట గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అనినీతి రహితంగా ప్రభుత్వ సేవలకు ప్రజలకు అందుతున్నాయన్నారు. గతంలో మండల కేంద్రాల్లోని కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగినా పనులు జరిగేవి కావని గుర్తు చేశారు. నేడు వలంటీర్ల ద్వారా ప్రతి సంక్షేమ పథకం ఇంటి వద్దకే చేరుతోందదన్నారు. కోవిడ్ సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సహాయ చర్యలను సచివాలయ సిబ్బంది ద్వారా అందించినట్లు వెల్లడించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. అదే జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని చూడలేని కబోదులు టీడీపీ నాయకులని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డీఈఈ వెంకటవినోదరెడ్డి, ఏఈ వీరయ్య, ఎంపీడీఓ ప్రసాద్, ఎంపీపీ మునివేలు, ఎస్సీసెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్, సర్పంచ్ గిరిజాప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు లక్ష్మణమూర్తి, వెంకటేశ్వర్లు, నరసింహులు, మోహన్‌గాంధీ, జయకుమార్, రాజయ్య, నాగరాజు, రమేష్, విజయ్ పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post