సచివాలయం తాకట్టు పెట్టాలా? వద్దా అనేది ప్రభుత్వం ఇష్టమని.. రుణాల కోసం అవసరమైతే తాకట్టు పెడతాం.. అందులో తప్పేముందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి డబ్బులు కావాల్సినప్పుడు బ్యాంకులకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం ఆనవాయితీ. సచివాలయం మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు కాగా దాని విలువ రూ.20 కోట్లు ఉంటుంది. దీనికే రాద్ధాంతం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన ఆస్తులే తాకట్టు పెట్టాలా?’ అని ప్రశ్నించారు.
source : eenadu.net










Discussion about this post