శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బికే పార్థసారధి గారికి అపూర్వ స్వాగతం పలికిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. పెనుకొండ వై జంక్షన్ వద్ద నుండి జిల్లా టిడిపి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బి కే పార్థసారథి గారి అభిమానులు బైకులు, కార్లలలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు అని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు మొదట అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూపురం పార్లమెంటు, పెనుకొండ నియోజకవర్గమునకు నాకు ఉన్న అనుబంధాన్ని వివరించాను. గత 40 సంవత్సరాలుగా నన్ను నమ్ముకున్న క్యాడర్ ను కాపాడవలసిన బాధ్యత నా మీద ఉందని తెలిపాను. నా అభ్యర్థనను మన్నించి హిందూపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నాపైన చూపుతున్న అభిమానానికి ధన్యుడను. నా కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు. భవిష్యత్తులో మీ అందరినీ కాపాడుకొంటానని తెలిపారు.
Discussion about this post