శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన శంఖారావం కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు హాజరయ్యారు. బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూజలు చేయగా, ఆయనతో పాటు చినబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. శంఖారావం బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారని, ఈ సభలకు విశేష స్పందన లభిస్తోందని చినబాబు తెలిపారు.
source : eenadu.net
Discussion about this post