రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, కుంటిమద్ది పంచాయతీ పరిధిలోని శేషంపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు చిదిగొండ్ల శివయ్య, చిట్ర గోపాల్, బన్నేల ప్రసాద్, చిదిగొండ్ల అనిల్ మరియు చెన్నేకొత్తపల్లి మండల బీజేపీ మాజీ కన్వీనర్ జీలకర్ర కార్తీక్ తదితరులు చెన్నేకొత్తపల్లి మండల తెదేపా కార్యాలయంలో, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది…
అనంతరం…
గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తేదీ 04.03.2024న, మధ్యాహ్నం 3గంటలకు పెనుకొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమ ఎదురుగా నిర్వహించే “రా.. కదలిరా”… బహిరంగసభలో పాల్గొనడానికి విచ్చేస్తున్న సందర్బంగా రాప్తాడు నియోజకవర్గం తెదేపా శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు అందరూ భారీగా తరలివచ్చి రా.. కదలిరా.. బహిరంగ సభను విజయవంతం చేయాలని పాత్రికేయుల సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది…











Discussion about this post