పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మగారు సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం శెట్టిపల్లి పంచాయతీ ,బ్రాహ్మణ కాలువ, బొజ్జి రెడ్డి పల్లి గ్రామాల్లో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి కే పార్థసారథి గారు మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. టిడిపి సూపర్ సిక్స్ కార్యక్రమం భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యను తెలుసుకొని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను తెలియజేస్తూ పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సవితమ్మ గారు మాట్లాడుతూ శెట్టిపల్లి గ్రామం పంచాయతీ అభివృద్ధి చెందిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే, వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని అన్ని వర్గాల ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టారని ,జగన్ తన మోసాలని టిడిపికి అంట కట్టి చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం జగన్ నైజమని దుయ్యబట్టారు. మద్యం నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని మాట ఇచ్చి మడమతప్పారని విమర్శించారు. మూడు లక్షల ఉద్యోగాలు, సిపిఎస్ రద్దు హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విద్యుత్ ఛార్జీల తొమ్మిది సార్లు పెంచి కోట్ల భారం నిరుపేదలపై పై వేసింది నిజము కాదా అని ప్రశ్నించారు ..ఉచిత ఇసుకను రద్దుచేసి వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఆసమర్థుడు మోసగాడు జగన్ అని సవితమ్మ గారు విమర్శించారు.. కావున రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా నన్ను ,ఎంపీ అభ్యర్థి BK పార్థసారథి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మళ్లీ మన ప్రాంతానికి సాగునీరు, తాగు నీరు ,మరిన్ని పరిశ్రమలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేసిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…..
Discussion about this post