ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చెన్నేకొత్తపల్లి మండలంలోని ముష్టికోవెల, సుబ్బరాయునిపల్లి, న్యామద్దల, చిన్నప్పేట, హరియాన్ చెరువు గ్రామాల్లో పర్యటించాను. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించాలని కోరాను. టీడీపీ హయాంలో తాగునీటి సమస్య లేకుండా చూస్తే, వైసీపీ ఎమ్మెల్యే చేతకాని తనంతో గ్రామాల్లో మంచి నీరు లభించని పరిస్థితి ఉంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ముష్టికోవెల, సుబ్బరాయునిపల్లి గ్రామాల్లో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరగా వారిని పార్టీలోకి ఆహ్వానించిన పరిటాల సునీత గారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమనడానికి ఈ చేరికలే నిదర్శనం అని తెలిపారు.
Discussion about this post