హిం దూపురం నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పనితీరు ను గుర్తించి వైసీపీ నుంచి టీడీపీలోకి చే రుతున్నట్లు పలువు రు యువకులు పే ర్కొన్నారు. మండ లంలోని శెట్టిపల్లి పంచాయతీ పెద్దన్నపల్లి, తిమ్మాడపల్లిల్లో మంగళవారం టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దన్నపల్లిలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరా రు. వారికి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్భంగా మినీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. నాయకులు గ్రీనపార్కు నాగరాజు, బేవనహళ్లి ఆనంద్, మాజీ సర్పంచ నారాయణప్ప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post