వైసీపీ నాయకులుగా చెప్పుకొంటూ పలువురు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవా లని కారుడిపల్లి గ్రామస్థులు వాపోయారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కారుడిపల్లి వాసులు మాట్లాడుతూ… మండలంలోని రామచంద్రాపురానికి చెందిన వైసీపీ నాయకుడు రామకృష్ణ ఆదివారం కారుడిపల్లి చెరువులో ఉదయం 6 గంటల నుంచి ఎక్సకవేటర్ సహాయంతో ట్రాక్టర్‌లలో మట్టి తరలిస్తున్నాడన్నారు. ఇది గమనించి రైతులు అక్కడికి వెళ్లి చెరువులో మట్టి తరలించరాదని, మీరు మట్టి తరలించ డానికి ఎవరు అనుమతులు ఇచ్చారని నిలదీశారు. దీంతో అతడు నన్ను అడగడానికి మీరెవరు…. అనుమతులు మీకెందుకు చూపించాలని దురుసుగా ప్రవర్తించాడని, దౌర్జన్యా నికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను విచారించి అనుమతులు ఇచ్చారా లేదా తెలుసుకొని చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులు పంట పొలాలకు మట్టి తోలుకోవాలని అడిగితె మాత్రం అనుమతులు ఇవ్వరని, ఇలా ఎక్స్‌క వేటర్‌లు పెట్టి మట్టిని తోలుకునేందుకు అనుమ తులు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని సంబంధిత వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. ఈ విషయంపై రూరల్ పోలీస్ స్టేషనలో కూడా సీఐకి తెలిపామన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post