వచ్చే ఎన్నిక ల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని, సీ ఎం వైఎస్ జగన ప్రజల తిరుగుబాటు ను ఉహించి ముందుగానే ఓటమిని ఒ ప్పుకుంటున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. జగన చేసిన అరాచకాలతో ప్రజల్లో తిరుగుబాటు మొ దలైందన్నారు. దీంతో భయపడి జగన ముందుగానే ఓటమిని ఒప్పుకుంటున్నారని అన్నారు. గతంలో ఎవరూ.. నా వెంట్రుక కూడా పీకలేరని ప్రగల్భా లు పలికిన జగన, ఇప్పుడు హ్యపీగా దిగిపోతా అంటున్నారని, దీన్ని బట్టి చూస్తే అతడికి ఓటమి భయం పట్టుకుందనే విషయం అర్థమవుతోందని తెలిపారు. ఐదేళ్లుగా ప్రజావనరులను దో చుకుని, లక్షల కోట్ల రూపాయలు వెనుకవేసుకున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదలు, సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారన్నారు. నవరత్నాల పథకాలతో ప్రజలకు ఒరిగేందేమీ లేదన్నారు. అవి నవరత్నాలు కాదని, నకిలీ రత్రాలని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికెళ్లడం, టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
source : andhrajyothi.com
Discussion about this post