వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై పలువురు వైసీపీలోకి చేరుతున్నారు. నగరంలోని 5వ డివిజన్ పరిధిలోని ఖాజా నగర్‌లో కమ్యూనిస్ట్ గోపాల్ తనయుడు ఉదయ్‌తో పాటు పలు కుటుంబాలు గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వారికి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ వైసీపీ అంటేనే ఒక నమ్మకమని, సీఎం జగన్ అంటే ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజాసంక్షేమం గురించి ఆలోచించి ఎన్నో పథకాలను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదని చెప్పారు. గతంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పథకాలు అందే పరిస్థితి ఉండేదని, కానీ నేడు కులం, మతం, రాజకీయాలు కూడా చూడకుండా అర్హత ఉంటే చాలు పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఐదేళ్లుగా తాము చేసిన మంచిని చూసి.. జగన్ మరోసారి సీఎం కావాలన్న ఆకాంక్షతో వైసీపీలోకి చేరుతున్నారని, అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని, ప్రతి ఒక్కరూ పార్టీలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్లి వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేశామని, ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలన్న కోరికతో తమ నాయకత్వంపై నమ్మకంతో వైసీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చి మరింత మేలు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో కమ్యూనిస్ట్ గోపాల్ తనయుడు ఉదయ్‌తో పాటు సావిత్రమ్మ, కవిత, తేజస్విని, శ్రీనివాసరెడ్డి, పద్మావతి, యశోద, నాగేంద్ర, రవి, వెంకటసాయి, సయ్యద్ బాషా, ఎండీ రమణ, గంగరత్నమ్మ, రాము, గోకుల్, లక్ష్మీదేవి, నరసింహ, ఆదిలక్ష్మి, కాంతమ్మ, రాజమ్మ, సుబ్బరత్నమ్మ, గీత, శేఖంబీ, రంగా రెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, వర్ఫ్ బోర్డ్ చైర్మన్ కాఘజ్ గర్ రిజ్వాన్, స్థానిక కార్పొరేటర్ జయలలిత, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, జేసీఎస్ జిల్లా కన్వీనర్ శివారెడ్డి, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, వైసీపీ క్లస్టర్ అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, రమణారెడ్డి, కార్పొరేటర్లు అబుసులెహ, అనిల్ కుమార్ రెడ్డి, మునిశేఖర్, డివిజన్ కన్వీనర్ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Discussion about this post