శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మొన్న రాత్రి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది బస చేసే అపార్ట్మెంట్ పై పోలీసులు కారణాలు చెప్పకుండా సోదాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం ఓటమి భయంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులతో ఈ విధమైన దాడులు చేయించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. వచ్చేది జనసేన- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం . .కచ్చితంగా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అలాగే సంఘ విద్రోహ కార్యక్రమాలను పాల్పడుతున్న అధికారులపై చట్టమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.. రెండు నెలల్లో జరిగే ఎలక్షన్ లో వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.. జగన్ సిద్ధం అని కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రజలందరూ కూడా నిన్ను ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు..
Discussion about this post