ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి,వైకాపా నాయకుల అరాచకాలపై నారా లోకేశ్ సమర శంఖారావం పూరించారని.. ఈ కార్యక్రమం ద్వారాప్రజలకు మరింత చేరవవుతామని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. శనివారం ఆయన ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురంలో విలేకర్లతో మాట్లాడారు. శంఖారావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు నేరుగా నారా లోకేశ్‌తో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేశ్ పర్యటించనున్నారన్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరిస్తారని చెప్పారు.
source : eenadu.net
Discussion about this post