వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరిల పోస్టులనూ తొలగించాలని సూచించింది. ఈ పోస్టులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. మంగళవారం ఈ వివరాలను ఎక్స్ వెల్లడించింది. ఈ నెల 2, 3 తేదీల్లో ఈ ఆదేశాలు వచ్చాయని, ఆ తర్వాత 10వ తేదీన ఈమెయిల్ ద్వారా ఫాలోఅప్ చేశారని తెలిపింది. ప్రజా జీవితానికి సంబంధంలేని వ్యక్తిగత విషయాలను పోస్టుల్లో ఉంచవద్దని ఈసీ సూచించినట్లు వివరించింది.
source : eenadu.net
Discussion about this post