తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సభకు పోలీసులు వైకాపా స్టిక్కర్లు అతికించిన కారులో రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం పెనుకొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లు ఉన్న కారులో పోలీసులు వచ్చారు. సభలో వీడియోలు తీస్తూ తెదేపా కార్యకర్తలను బెదిరించారని తెదేపా ట్వీట్ చేసింది. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post