పెనుకొండ నియోజకవర్గంలో వైకాపాలో శిలాఫలకాల మార్పుపై వివాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ ఆధ్వర్యంలో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా భవనాలను నిర్మించి ఎమ్మెల్యే, సీఎం చిత్రపటాలతో శిలాఫలకాలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి ఉంచారు. ప్రస్తుతం వాటిని తొలగించి, అదే స్థానంలో కొత్తగా జగన్, మంత్రి ఉషశ్రీ చిత్రాలతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రొద్దం మండలం తురకలాపట్నం గ్రామంలోని జగనన్న కాలనీలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే భవనాలను మంత్రి ఉషశ్రీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. కొత్త శిలాఫలకం బోర్డులో తన పేరు లేని విషయాన్ని గమనించిన సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాసులుతో పాటు వైకాపా నాయకులు వెళ్లి చర్చించినట్లు తెలిసింది.
source : eenadu.net
Discussion about this post