నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వైకాపా ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. వెంటనే ఆమోదించాలని కోరుతున్నా. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైంది. నరసాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post