సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పరిగి మండల టీడీపీ కన్వీనర్ లక్ష్మీరెడ్డి బుధవారం పెనుకొండలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు మంత్రి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. లక్ష్మీరెడ్డిరాకతో పరిగిలో పార్టీ మరింత పటిష్టమవుతుందన్నారు.
రాష్ట్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని లక్ష్మీరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ సిద్ధాంతాలు, జగనన్న పాలన నచ్చి వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. పార్టీలకు అతీతంగా ఇన్ని సంక్షేమ పథకాలను అందించిన ఏకై క సీఎం వైఎస్ జగనన్న మాత్రమేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా ఆ పార్టీ గెలవలేదన్నారు. అలాగే పెనుకొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సవిత ఒంటెత్తు పోకడలతో కార్యకర్తలు విసిగిపోయారని, వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీలో చేరుతారన్నారు. ప్రజలందరి మద్దతుతో పెనుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండాను మరోసారి ఎగురవేసి వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు. అంతకముందు పరిగిలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీరెడ్డి మంత్రి భర్త చరణ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
source : sakshi.com
Discussion about this post