అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది.
అలాగే.. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్(రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇంతియాజ్ ఈ మధ్యే వీఆర్‌ఎస్ తీసుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు.
తాజాగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని.. ఒకటిరెండు మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్‌ఛార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు.

Discussion about this post