నగరంలోని షౌవూకారుపేటకు చెందిన 40 మంది జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో శనివారం చేరారు. వారికి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరినట్లు నేతలు తెలిపారు. పార్టీలో చేరినవారిలో రోషన్, రోనాక్, షోయాల్, అల్లాబక్షు, నిజాం, మురాద్‌ఆలీ, ముబారక్, మురాద్‌షా, పండు తదితరులు ఉన్నారు.
మండలంలోని సుద్ద్దల కుప్పం గ్రామానికి చెందిన దాము, నాగరాజు, దిలీప్‌కుమార్ ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్షంలో వైఎస్సాసీపీలో శనివారం చేరారు. శుక్రవారం వీరికి మాయమాటలు చెప్పి మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి చేరినట్లు ప్రచారం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ సదరు నేతలను పిలిపించి మాట్లాడారు. టీడీపీ వారి కల్లబొల్లి కబుర్లకు మోసపోయామని, అందుకు చింతిస్తున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ యువరాజు, పార్టీ మండల కన్వీనర్ బాల గురునాథ్ పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post