మాదిగలపై వివక్ష చూపే పార్టీలకు మాదిగలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఐక్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. మాదిగ సమ్మేళనంలో భాగంగా బుధవారం నగరంలోని తెలుగు తల్లి విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ మీదగా అంబేడ్కర్ భవన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2019లో తెదేపాను కాదని వైకాపాను నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించింది మాదిగలేనన్నారు. 2024 ఎన్నికల్లో మాదిగలకు రాజకీయంగా ఎమ్మెల్యే స్థానం నుంచి అన్ని రాజకీయ పదవుల్లోను స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలపై దాడులు, హత్యలు అత్యాచారాలు, భూ కబ్జాలు చేయాలని చూస్తే ఏ పార్టీకైనా తగిన గుణపాఠం చెబుతామన్నారు. నాయకులు మధు మాదిగ, బంగి నాగ, కదిరయ్య, రాజా రమేశ్, శివశంకర్, బీసీఆర్ దాస్, మాజీ ఎమ్మెల్యే యామినిబాల, రాజగోపాల్, నారాయణస్వామి పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post