బ్రిటిష్ వారిని పారద్రోలేందుకు నాడు జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే.. నేడు రాష్ట్రంలో పోరాటం చేసి విధ్వంస పాలనకు ముగింపు పలకాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ‘దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన వారిని స్మరించుకుందాం. రామరాజ్య స్థాపనకు మన వంతు కృషి చేయడమే జాతిపితకు మనమిచ్చే అసలైన ఘననివాళి’ అని ఆయన పేర్కొన్నారు.
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మహాత్ముడి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. సత్యం, శాంతి, అహింస, సత్యాగ్రహం అనే పునాదులపై స్వాతంత్రోద్యమాన్ని ఆయన నిర్మించారని వారు కొనియాడారు. కార్యక్రమంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు.
source : eenadu.net










Discussion about this post