ఆత్మకూరులో మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపనకు సోమవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఆత్మకూరు ఎంపీపీ సుబ్బర హేమలత, హిందూపురం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త శాంతమ్మ హాజరయ్యారు. వాల్మీకి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి పూజించి, శాస్త్రోక్తంగా భూమిపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
Source:https://www.sakshi.com/telugu-news/ananthapur/1926273
Discussion about this post